మహిళా విద్యాభివృద్ధికి ‘ఉల్లాస్' దోహదం: DRDO PD

మహిళా విద్యాభివృద్ధికి ‘ఉల్లాస్' దోహదం: DRDO PD

ADB: గ్రామీణ మహిళల విద్యాభివృద్ధికి NIOS పరీక్షలు ఎంతో అవసరమని డీఆర్డీఓ పీడీ రాథోడ్ రవీందర్ అన్నారు. నార్నూర్‌లోని గోండుగూడ గిరిజన పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మహిళలు విద్యపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజారామ్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.