బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

SRD: సదాశివపేట్‌కు చెందిన తాహీరా బేగం అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చికిత్స ఖర్చుల నిమిత్తం వారి కుమారుడు హర్షద్‌కు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా సహాయం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. సహాయం అందించిన ఎమ్మెల్యేకు  బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.