ఇక ప్రతినెలా మూడో శనివారం పుస్తకాలు లేకుండానే..!
NLG: పుస్తకాల బరువుతో ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇక ప్రతినెలా 3వ శనివారం పుస్తకాలు లేకుండానే విద్యార్థులు బడికి వెళ్లనున్నారు. బడి అంటేనే పుస్తకాలు,పెన్నులు, రాతలు, చదువులు ఉండేవి. ఇక నెలలో ఒక్కరోజు ప్రభుత్వం వాటన్నింటికీ సెలవు ప్రకటించింది. తాజాగా మూడో శనివారం 'నో బ్యాగ్ డే' పాటించేందుకు ఆదేశాలు జారీ చేశారు.