VIDEO: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: మంత్రి

HNK: తెలంగాణ విద్యా వ్యవస్థలో గిరిజన విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్టడీ సెంటర్‌ను మంత్రి సీతక్క శనివారం సందర్శించి, విద్య, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో గిరిజన జీవితాలు వెలుగొందుతాయని ఆమె అన్నారు.