మే 11 నుంచి గృహ గణన: కలెక్టర్
SRPT: సూర్యాపేటలో జనగణన-2027కు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ గణన చేపడతామని ఈరోజు కలెక్టర్ తేజస్ తెలిపారు. ప్రజలు ఏప్రిల్ 26 నుంచి మే 10లోపు https://se.census.gov.in పోర్టల్ ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు అనంతరం వచ్చే యూనిక్ కోడ్‌ను గణనాధికారికి చూపాలని సూచించారు.