జిల్లాలో రేపు జాబ్ మేళా

జిల్లాలో రేపు జాబ్ మేళా

అనకాపల్లి: జిల్లాలోని దేవరపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్. గోవిందరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి, యువకులు టెన్త్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ పేజీ చదివి 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని తెలిపారు.