గ్యాస్ కొరత.. రంగంలోకి పోలీసులు
TG: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎండలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రద్దీ పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి టోకెన్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.