'మహిళా ఉద్యోగులకు ఎమ్మెల్యే కూన వేధింపులు'

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులకు ఫోన్లు చేసి వేధిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ‘కేజీబీవీ ప్రిన్సిపల్‌కు కూడా ఆయన వేధింపులు తప్పడం లేదు. మహిళా ఉద్యోగులు లొంగకుంటే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నారు’ అని ట్వీట్ చేసింది. ఎమ్మెల్యే తన శాడిజం చూపుతున్నారని మండిపడింది.