బిగ్ షాక్.. పెట్రోల్ బంకులు క్లోజ్..!
ASF: వాంకిడి మండలంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక హెచ్‌పీ పెట్రోల్ బంకుల్లో నిన్నటి నుంచి ఇంధనం నిల్వలు లేక వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డు మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడి రెండు బంకుల్లో ఒకే బంకు అందుబాటులో ఉండటంతో రద్దీ పెరిగింది. పెట్రోల్ సరఫరా ఆలస్యమైతే ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.