టీవీకేతో కూటమిపై అధిష్ఠానానిదే నిర్ణయం: నాగేంద్రన్
టీవీకేతో కూటమిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వెల్లడించారు. విజయ్ తన సిద్ధాంతాలను ముందు చెప్పి ఆ తర్వాత మిగిలిన పార్టీలవి అడగాలని సూచించారు. రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారని డీఎంకే అధినేత స్టాలిన్ కాదని పేర్కొన్నారు. అమ్మ ప్రారంభించిన ఎన్నో పథకాలను డీఎంకే ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు.