ఇక నుంచి ఇంటి పన్నులు ఆన్‌లైన్‌లోనే..!
ప్రకాశం: మర్రిపూడిలోని జువ్విగుంటలో ఇంటి పన్నులు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ శుక్రవారం అవగాహన కల్పించారు. స్వర్ణ పంచాయతీలో భాగంగా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని, నగదు రూపంలో చెల్లింపులు ఇక నుంచి కొనసాగవని తెలిపారు. అనంతరం పోస్టర్లు, కరపత్రాలు పంచిపెట్టారు.