రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన DRM

PPM: వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర మంగళవారం బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్‌లను తనిఖీలు చేసారు. ప్రయాణికులకు మొదట ప్రాధాన్యత కల్పిస్తూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. స్టేషన్‌లో చేపడుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించారు. నిరీక్షణ గదులు, బుకింగ్ కౌంటర్, సిబ్బంది వేచి ఉన్న రూంలను తనిఖీ చేశారు. ఆయన వెంట సీనియర్ డిసీఎం సందీప్ ఉన్నారు.