తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్

తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్

RR: డిసెంబర్ 9 విజయ్ దివస్ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన గొప్ప నేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. దీక్షా దివస్ ప్రాముఖ్యతను యువతకు వివరించవలసిన అవసరం ఉందన్నారు.