అతలాకుతలం చేస్తున విభిన్న వాతావరణం..!
CTR: జిల్లా ప్రజల్ని విభిన్న వాతావరణాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఓ వైపు భగ్గుమంటున్న ఎండలు, ఉక్కపోత జనాన్ని భయపెడుతుంటే, మరోపక్క పిడుగులతో కూడిన వడగండ్ల వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో అకాల వర్షాలతో చేతికందిన పంటలు చేజారి పోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.