కాలిపోయిన మొక్కజొన్న పంట

WGL: నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామానికి చెందిన చిన్నాల ఐలయ్య సన్నాఫ్ ఎల్లయ్యకు చెందిన మొక్కజొన్న కాలి బూడిద అయింది. తనకున్న రెండు ఎకరాలు భూమిలో మొక్కజొన్న పంట వేయగా దురదృష్టవశాత్తూ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఆదివారం మొక్కజొన్న పూర్తిగా కాలిపోయింది. ప్రభుత్వం అధికారులు తనకు జరిగిన నష్టాన్ని గుర్తించి, ఆదుకోవాలని బాధితుడు ఐలయ్య కోరుతున్నాడు.