'మద్యం సేవించి వాహనాలు నడపవద్దు'

'మద్యం సేవించి వాహనాలు నడపవద్దు'

MDK: మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్సై రాజు హెచ్చరించారు. వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో శనివారం ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.