కారు, లారీ ఢీ.. మహిళకు స్వల్ప గాయాలు

VZM: భోగాపురం జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఉదయం కారు, లారీ ఢీకొన్న ఘటనలో మహిళకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలవ్వగా ఆమెను సుందరపేట CHCకి తరలించారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా దెబ్బతింది.