అభ్యంతరం తెలిపిన గులివిందాడ రైతులు

VZM: విశాఖపట్నం నుండి రాయపూర్ హెచ్‌పీసిఎల్ భూగర్భ పైప్ లైన్ వేయుటకు ఏపిలో నాలుగు జిల్లాలు, 30 మండలాలు 113 గ్రామాల మీదుగా వేయుటకు బహిరంగ విచారణ నిర్వహించారు. మంగళవారం కొత్తవలస ఎంపిడివో కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ విచారణ భూములు కోల్పోయిన వారికి ఉపాధి చూపించాలని కోరారు. భూసేకరణకు గులివిందాడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.