పరిటాలలో వైసీపీ నేతను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్: కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో నివాసం ఉంటున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్షులు మార్త శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు వారి నివాసానికి చేరుకొని ఇవాళ ఆయనను పరామర్శించారు.