పిచ్చి మొక్కల తొలగింపు

పిచ్చి మొక్కల తొలగింపు

WNP: పట్టణంలోని 28వ వార్డు వెంగళరావు నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ సిబ్బంది పారిశుధ్యం పనులు చేపట్టారు. వర్షాల కారణంగా కాలనీలో ఏర్పడ్డ పిచ్చి మొక్కలను జెసిబి సహాయంతో తొలగించారు. పనులను కాంగ్రెస్ ఓబీసీ సెల్ నేత కోట్ల శిరీషరవి పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు సంభవించకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు.