శిశు విక్రయ ఘటనపై సీరియస్... కేసు నమోదు..

శిశు విక్రయ ఘటనపై సీరియస్... కేసు నమోదు..

నల్గొండ జిల్లాలో శిశు విక్రయం ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. శిశువును అమ్మిన తల్లిదండ్రులు బాబు, పార్వతితో పాటు కొనుగోలు చేసిన వ్యక్తులు, మధ్య దళారులుగా వ్యవహరించిన వారిపై కేసు నమోదు చేయాలని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.