అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు

అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు

TG: హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. రెండు రోజుల కిందట వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే, వెంకట్ రెడ్డి ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో రెండు రోజులపాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో రూ.30 లక్షలకు పైగా కరెన్సీ, మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.