గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరించండి: మంత్రి

గ్రామ సమస్యలు వెంటనే పరిష్కరించండి: మంత్రి

WNP: చిన్నంబావి మండలం దగడపల్లి, చిన్నదగడపల్లి గ్రామాల్లో ఇవాళ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో స్థానిక అధికారులు, ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గ్రామ సమస్యలను, సంక్షేమ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.