కల్తీ మద్యం.. నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు
AP: నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. జనార్దన్, జగన్‌మోహన్‌ను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిందితులు ఇద్దరినీ ఇప్పటికే పోలీసులు వారంపాటు ప్రశ్నించారు. గత నెల 30తో ఇరువురి కస్టడీ ముగిసింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో జనార్దన్, విజయవాడ జైలులో జగన్‌మోహన్ ఉన్నారు.