కృష్ణలంక లో తగ్గిన క్రైమ్ రేట్

NTR: క్రైమ్ రేటును తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కృష్ణలంక సీఐ నాగరాజు తెలిపారు. సీఐ నాగరాజు గత ఏడాది ఆగస్టు 9వ తేదీన కృష్ణలంక సీఐగా బాధ్యతలు చేపట్టారు. 2024 సంవత్సరం ఆగస్టు వరకు 320 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 130కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు.