'రజక కుటుంబంపై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలి'
MHBD: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ... తొర్రూరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనం నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, రజక కుటుంబంపై దాడికి పాల్పడి, చిన్నారి మృతికి కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.