VIDEO: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన: ఎస్పీ
NGKL: తెలకపల్లి మండలంలోని తెలకపల్లి, రాకొండ, గౌరెడ్డిపల్లిలో పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉదయం సందర్శించారు. ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.