భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

NZB: బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హాల్లో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.