రాముల వారికి పచ్చల హారం బహుకరించిన మాజీ మంత్రి పువ్వాడ తనయుడు

కొత్తగూడెం: భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వర్ణంతో పొదిగిన పచ్చలహారంను బహుకరించారు. పచ్చల హారంను ఆయన తనయుడు నయన్ రాజ్ బుధవారం ఆలయంలో స్వామి వారికి సమర్పించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యపాలన చేసిన శ్రీరాముడు ఆదర్శ పరిపాలకుడని పువ్వాడ కొనియాడారు. ఈ సందర్భంగా అజయ్ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు