నకిలీ కేబుల్ వైర్ల అమ్మకం.. నలుగురిపై కేసు నమోదు

ADB: ఇంద్రవెల్లి మండలంలో నకిలీ కేబుల్ వైర్లను అమ్ముతున్న నాలుగు ఎలక్ట్రికల్ షాపుల యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీసెస్ లిమిటెడ్ సౌత్ రీజియన్ హెడ్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. దర్యాప్తులో నకిలీ కేబుళ్లు బయటపడటంతో దుకాణాల యజమానులపై కేసు నమోదు చేశామన్నారు.