అయ్యప్ప దేవాలయానికి వెండి అరటి ఆకు పాత్ర బహుకరణ

SRPT: జిల్లాలోని శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయానికి విరమళ్ళ మాల్సూరు, ఉపేంద్ర దంపతులు సుమారు రూ. లక్ష వెచ్చించి దేవాలయానికి వెండి అరటి ఆకు పాత్రను బహుకరించారు. ఈ వెండి పాత్రలో అయ్యప్ప స్వామి వారికి నిత్యం నైవేద్యం నివేదిస్తామని ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు బెల్లిదే శ్రీనివాస్, ఎలుగూరి రాంబాబులు తెలిపారు.