నార్సింపల్లిలో టీచర్స్ డే వేడుకలు
సత్యసాయి: తాడిమర్రి మండలం నార్సింపల్లి జేవీఎం ఆర్డీటీ పాఠశాలలో గురువారం ముందస్తు టీచర్స్ డే వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. హెచ్ఎం హరి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించేది ఉపాధ్యాయులేనని, వారికి శతకోటి వందనాలు అర్పిస్తున్నట్లు హెచ్ఎం పేర్కొన్నారు.