రోడ్డు ప్రమాదంలో బావ, బావమరుదుల దుర్మరణం
BDK: అశ్వారావుపేట (M)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బావ, బావమరుదులు మృతి చెందారు. ఏలూరు జిల్లా తాటిరామన్నగూడేనికి చెందిన సంతోష్, సందీప్ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం వద్ద వారి బైక్‌ను లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలన్ని ఎస్సై అఖిల సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.