సాయి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ
SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న ప్రపంచ సదస్సులో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబా బోధనలు ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. సాయి ఆశయాల స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.