డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం

MNCL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘డిజిటల్ పంట సర్వే’ను జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు ప్రారంభించారు. ఒక్కో పురుష ఏఈవోకు రెండు వేలు, మహిళా ఏఈవోకు 1,800 ఎకరాల భూములను కేటాయించారు. ఒక్కో ఏఈవో పరిధిలో 5 వేల ఎకరాల భూములు ఉంటే వాటిలో రెండు వేలు డిజిటల్ క్రాప్ సర్వే చేయాలి. మిగతా మూడువేల భూములను సాధారణంగా పంట నమోదు చేయాల్సి ఉంటుంది.