VIDEO: 'ప్రతి అర్జీని పరిష్కరిస్తాం'
TPT: పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రజాదర్బార్ జరిగింది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గృహ నిర్మాణం, భూ సమస్యలపై భారీగా వినతులు వచ్చాయి. ప్రతి అర్జీని పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.