ఈనెల 6న సర్వ సభ్య సమావేశం

ఈనెల 6న సర్వ సభ్య సమావేశం

మన్యం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 6న, జరుగుతుందని కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.