పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

HYD: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదల సంక్షేమం కోసం సన్నబియ్యం పంపిణీని ప్రవేశపెట్టమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. గురువారం రసూల్ పురలోని రేషన్ షాపులో పేదలకు సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పంపిణీ కార్యక్రమం ఆలస్యం అయిందన్నారు. పేదల్లో సన్నబియ్యం పథకం పట్ల ఆనందం వ్యక్తమవుతుందని చెప్పారు.