'మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం'

NZB: కమ్మర్ పల్లి మండలంలోని చౌటుపల్లి జడ్పీహెచ్ఎస్‌లో నిర్వహించిన మానవ సంబంధాలపై టెక్నాలజీ ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీలో గెలుపొందిన విజేతలను శుక్రవారం నగదు, మెమెంటో,శాలువాలతో సత్కరించారు. మొదటి విజేత జి. ప్రణవికి రూ.1116, ద్వితీయ విజేత శాలినికి రూ.751, తృతీయ విజేత ప్రణవికి రూ.500నగదు బహుమతులు లయన్స్ క్లబ్ కోశాధికారి రమేష్ తన తండ్రి జ్ఞాపకార్థం అందజేశారు.