మామిడి పంట సాగుపై అవగాహన కార్యక్రమం

మామిడి పంట సాగుపై అవగాహన కార్యక్రమం

VZM: బొబ్బిలి మండలం డొంగురువలసలో శనివారం మామిడి రైతులకు పంట సాగు, యాజమాన్య పద్ధతులపై ఉద్యానవన శాఖ అధికారి వెంకటరత్నం అవగాహన కల్పించారు. రసాయన మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే పద్ధతిని వివరించారు. మామిడి తోటలో పచ్చిరొట్ట విత్తనాలు వేసి కలియ దున్నితే భూమి సారవంతం అవుతుందని సూచించారు.