బావిలో పడి తండ్రి,కొడుకు మృతి

బావిలో పడి తండ్రి,కొడుకు మృతి

NLR: వలేటివారిపాలెం మండలం పొలినేనిపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి తండ్రి, కొడుకు మృతిచెందారు. పాపారావు, అతని కుమారుడు శ్రీకాంత్ పొలాల్లో గొర్రెలు మేపుతుండగా.. తాగునీటి కోసం శ్రీకాంత్ బావిలోకి దిగగా ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి యత్నించగా ఇద్దరు అందులోనే పడి మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.