నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

HYD: హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాతబస్తీలో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన యువకుడు అఖిల్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, బాధిత బాలికకు రూ.8 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.