ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం
MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఇవాళ గ్రామ సర్పంచ్ నల్గురి రామలింగం, పశు వైద్యాధికారి డాక్టర్ మాధవి ప్రారంభించారు. పశువులు యాదకు వచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేయించాలని, పశు గ్రాసలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.