VIDEO: సీఎం సభకు నిరసన సెగ
HYD: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగా సభ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సభలో సీఎంకు నిరసన సెగ ఎదురైంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, విద్యార్థులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ వెంటపడ్డారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య నుంచి ఆయన వెళ్లిపోయారు.