గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. ఉద్రిక్తత
AP: ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం అంబేద్కర్ గురుకుల పాఠశాల టెన్త్ విద్యార్థిని కావ్య ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, కావ్య ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కావ్య ఆత్మహత్యపై విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.