RR జిల్లాలో ఎండ మంటలే.. గండిపేటలో గుండు కాలుతోంది!
RR: జిల్లాలో ఎండమంటలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గండిపేట మండలం మణికొండ ఏరియాలో 42.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కందుకూరు 42.4, మొయినాబాద్, మంచాల, ఇబ్రహీంపట్నం, షాబాద్, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం సహా దాదాపు 18 ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉ.11 నుంచి సా.4:00 వరకు బయటకు రాకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.