'స్టూడెంట్స్ క్లబ్ విధానం స్ఫూర్తిదాయకం'
KNR: కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం కళాభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు టీ షర్టులు, బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు.