'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'

'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి'

KNR: చొప్పదండి మండలంలో పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్సై నరేశ్ రెడ్డి కోరారు. ఎన్నికల సందర్భంగా ఆర్నకొండ, రాగంపేట గ్రామాల్లో సివిల్, డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసులతో కలిసి ఆయన కవాతు (ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా ఎన్నికలను విజయవంతం చేయాలని ప్రజలను చైతన్య పరిచారు.