గ్లోబల్ సమ్మిట్.. 44 దేశాల నుంచి 154 మంది
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. అమెరికా నుంచే 46 మంది వస్తున్నారు. HYDలోని భారత్ ఫ్యూచర్ సిటీలో రేపు మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు CM రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. సమ్మిట్‌లో తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047ను ఆవిష్కరిస్తారు.