VIDEO: పిఠాపురంలో అగ్నిప్రమాదం
కాకినాడ: పిఠాపురం రూరల్ విరవాడ రోడ్డులోని గంగానగరంలో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జనవాసాల మధ్య మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తెచ్చారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రమాద కారణాలు నిర్ధారించాల్సి ఉంది.